calender_icon.png 9 October, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నెత్తికెక్కిన భూకబ్జా..

09-10-2025 12:00:00 AM

-సింగరేణి సీఎండీనీ కలవడంపై వివాదం...

-సింగరేణి భూకబ్జా ఉచ్చులో ఎమ్మెల్యే ఇరుక్కున్నారా..?

-కక్కలేక.. మింగలేక కాంగ్రెస్ శ్రేణులు సతమతం

-సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తీరుపై వాడివేడి చర్చ 

-భూకబ్జాలపై ఆందోళనలకు సిద్ధమవుతున్న అఖిలపక్షాలు? 

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 8: ‘ఇలాంటి ఎమ్మెల్యేను తమ జీవితంలో ఎప్పుడూ ఎరుగమని బాహాటంగానే అంటున్నారు విపక్షా లు, ప్రజలు...‘ఎమ్మెల్యే తీరుపై ఇలా స్థానికంగా చర్చించుకోవడం ఆసక్తిగా మారింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి భూకబ్జాలు హాట్ టాపిక్  మారాయి. ఎక్కడ నలుగురు గుమికూడినా సింగరేణి భూ కబ్జాపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మూతపడిన సింగరేణి సౌత్ క్రాస్ కట్ బొగ్గుగని కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు.

వారం రోజులుగా బెల్లంపల్లిలో ఈ భూక బ్జా తీరు, దాని పరిణామాలు ఆసక్తిగా మారా యి... ఓ కమ్యూనిటీ సమూహం అంగ బలం, అర్ధబలంతో సింగరేణి భూముల కబ్జాకు తెగబ డింది. అధికారులు మాత్రం ఈ కబ్జాకూ ఆదిలోనే అడ్డుపడ్డారు. ఈ ఇష్యూ ఇక్కడితో సద్దుమనిగిపోయిందనుకున్న క్రమంలో స్థాని క ఎమ్మెల్యే ఎంట్రీతో భూకబ్జా ప్రాణం పోసుకుంది. కబ్జాదారుల పక్షం చేరడంపై విమ ర్శలు ఆయనపై ఒక్కసారిగా  ముసురుకున్నా యి. కబ్జాదారుల కొమ్ముకాస్తోన్న కొందరు కాంగ్రెస్ లీడర్లు కట్ట కట్టుకొని హైదరాబాద్‌కు వెళ్ళి ఎమ్మెల్యేను కలిసి మంతనాలు జరిపా రు. అంతే కాకుండా ఆయనతో కబ్జాకోరులు డీల్ కూడా కుదుర్చుకున్నారనీ సమాచారం. 

కబ్జా భూమినీ అప్పగించడానికి ఎమ్మెల్యే వినోద్ సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని ఆశ్రయించారు. ఓ వైపు సింగరేణి కబ్జా భూమిని స్వాధీనం చేసుకోగా, దాన్ని కాజేయడానికి కంకణం కట్టుకున్న కబ్జాదారులకు ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి భూముల పరిరక్షణకు సింగరేణి అధికారులకు అండగా ఉండాల్సింది పోయి, ఎమ్మెల్యే వినోద్ భూకబ్జాదారులకు వత్తాసు పలకడంపై స్థానికంగా వాడివేడిగా చర్చ జరు గుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా చేయడమేంటన్న..? ప్రశ్న అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 

అఖిల పక్షాలు లొల్లికి సై...

బెల్లంపల్లిలో సింగరేణి భూకబ్జాలపై అనుకూల, ప్రతికూలాల మధ్య రగడ మొదలైంది. కబ్జాదారుల వైపు ప్రజాప్రతినిధి నిలి చిన తీరుపై ప్రజల్లో ఆగ్రహవేశాలు బగ్గుమంటున్నాయి. ఓ వర్గానికి కోట్ల విలువ చేసే భూమిని కట్టబెట్టేందుకు తన అధికార బలాన్ని వినియోగించడాన్ని ఆధ్యాంతం తప్పుపడుతున్నారు. సింగరేణి భూమి పరిరక్షణ కోసం అఖిల పక్షాలు పోరాడేందుకు సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఈ దిశగా కార్యాచరణకు పూనుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఆందో ళన ఎమ్మెల్యే లక్ష్యంగా మారనుంది. ఈ పరిస్థితి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావానికి దారితీయనుంది. దీంతో కాం గ్రెస్ రాజకీయ ప్రతిష్టకు తీవ్ర భంగం తప్పదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.‘గాలికి పోయే కంపను మెడకు చుట్టుకోవడం’అంటే ఇదేనేమో అని రాజకీయ విశ్లేషకులు ఎమ్మె ల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇరకాటంలో కాంగ్రెస్ శ్రేణులు..

ముందు చూపు కరువైన ఎమ్మెల్యే తీరు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను రచ్చ రచ్చ చేసిందని పార్టీశ్రేణులు అంతర్మథనంలో పడిపోయా రు. కబ్జా వైనం స్వరూపం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది. ఉన్నట్టుండీ ఎమ్మె ల్యే ఇలా ఓ కమ్యూనిటీ భూ కబ్జాను నెత్తినెత్తుకోవడంతో పార్టీ శ్రేణులు అసలు జీర్ణించుకోవ డం లేదు. సంబంధం లేని ఈ వ్యవహారంతో కాంగ్రెస్ పరువు గంగపాలైందని వాపోతున్నారు. ఇలా అనూహ్యం గా భూకబ్జా మకిలి కాంగ్రెస్‌కు అంటుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ శ్రేణులు మింగలేక, కక్కలేక సతమతమవుతున్నారు. ఎమ్మెల్యే తీరు కాంగ్రెస్ పార్టీనే అమాంతం ఇరకాటంలో పడేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.

వివాదంలోకి ఎమ్మెల్యే... 

బెల్లంపల్లి ఎమ్మెల్యే తీరు తీవ్ర వివాదాస్పదం కావడం, కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలు చేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాపో తున్నారు. భూ కబ్జాల సంస్కృతికి ఎదురు నిలనిలబడాల్సిన ఎమ్మెల్యే వాటికి దన్నుగా మారి తీవ్ర వివాద సుడిగుండంలో ఇరుక్కుకున్నారు. మంచీచెడు విచక్షణకోణం ప్రజాప్రతినిధికి కొలమానంగా ఉండాలన్న స్పృహ ఇక్కడ ప్రశ్నార్థకమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఊరందరిదీ ఒకదారి.. ఉలిపికట్టుది మరోదారి...’ అన్నట్టు ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదంగా మారిందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నా రు.ఆపాల గోపాలం భూకబ్జాపై నిప్పు లు చెరుగుతుంటే.. ఎమ్మెల్యే మాత్రం యూటర్న్ తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.