calender_icon.png 18 January, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో దారుణం

18-01-2026 01:11:16 AM

కారుతో గుద్ది హిందువు దారుణ హత్య

రాజ్‌బరి జిల్లాలో ఘటన

ఢాకా, జనవరి ౧౭: వాహనంలో పెట్రోల్ నింపించున్న మేర డబ్బు చెల్లించమని అడిగిన ఉద్యోగిని ఓ వాహనదారుడు కారు గుద్ది హతమార్చిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసు కున్నది. శుక్రవారం తెల్లవారుజామున రాజ్‌బరి జిల్లాలోని ఒక పెట్రోల బంక్‌లో ఈ ఘటన జరిగింది. గోలందమోర్‌లోని కరీం పెట్రోల్ బంక్‌లో రిపన్ సాహా అనే హిందూ యువకుడు సనిచేస్తున్నాడు. రోజూలాగానే సాహా తెల్లవారుజామున విధుల్లోకి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత బంక్‌లోకి ఓ కారు వచ్చిం ది. కారు యాజమాని ౫ వేల టాకాల విలువైన ఇంధనాన్ని కారులో నింపించుకున్నాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా కారు స్ట్రాట్ చేసి వెళ్తుండగా రిపన్ సాహా కారుకు అడ్డంగా వెళ్లాడు.

దీంతో వాహనదారుడు వేగంగా వెళ్లి సాహాను ఢీకొట్టి అక్కడి నుంచి ఉడాయించా డు. దాడిలో సాహా తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు.రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించారు. కారు యజమా ని అబుల్ హషీమ్ సహా డ్రైవర్ కమల్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అబుల్ హషీ మ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో కీలక పదవిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు ఇద్దరు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గడిచిన నెల రోజుల్లోనే బంగ్లాదేశ్‌లో ౧౫ మంది వరకు హిందువులు హత్యకు గురికావడం కలకలం రేపుతున్నది. మైనారిటీ ఓటర్లను భయపెట్టేందుకే దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.