calender_icon.png 14 October, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి

14-10-2025 12:56:54 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం అసిఫాబాద్,అక్టోబర్ 13(విజయ క్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తో కలిసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తరావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, 

సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో  ఇండ్ల మంజూరు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి.డి. వేణుగోపాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.