calender_icon.png 8 January, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి కక్షతో దాడి.. సామాజిక బహిష్కరణ

05-01-2026 03:52:53 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో రాజకీయ కక్షలు పరాకాష్టకు చేరాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కృష్ణా రెడ్డి తనకు ఓటు వేయలేదన్న కోపంతో మధుసూదన్ రెడ్డి అనే ఓటర్ పై తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయలేదనే నెపంతో రెడ్డి సంఘం సభ్యులు మధుసూదన్ రెడ్డిని కులబహిష్కరణ చేశారని తెలిపారు. తనపై దాడి చేసి కుల బహిస్కరించిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని బాధితుడు రాజగోపాల్ పేట పోలీసులను ఆశ్రయించారు. పిర్యాదు తీసుకున్న పోలీసులు బాధితున్నీ చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి పంపించారు.