calender_icon.png 3 November, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం హేయమైన చర్య

03-11-2025 12:30:08 AM

బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్య 

 నూతనకల్ నవంబర్ 2: కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మణుగూరు బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం హేయమైనా చర్య అని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య అన్నారు.  ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గూండాలా అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరిచి అరాచత్కాత్వాన్ని కొనసాగుతుందన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీపై రోజురోజుకు ప్రజల ఆదరణ పెరుగుతుందని, అది చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే దీనికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్, మాజీ సర్పంచ్ చూడు లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు గాడుదుల లింగరాజు, నాయకులు బత్తుల విద్యాసాగర్,ఉప్పుల వీరు యాదవ్,కనకటి మహేష్,రేసు వెంకటేశ్వర్లు, బత్తుల విజయ్, మొగుళ్ళ వెంకన్న , రవి, సైదులు తదితరులున్నారు.