calender_icon.png 14 January, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా అధికారులపై దాడులు హేయం

13-01-2026 12:00:00 AM

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

టీఎన్జీవో నేతల డిమాండ్

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో మహిళా ఐఏఎస్ అధికా రులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నిరసిస్తూ టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ నాయకత్వంలో సోమవా రం కలెక్టరేట్ ఆవరణలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించబడింది. కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన భౌతిక దాడిని మరువక ముందే, ఇప్పుడు మహిళా అధికారులపై డిజిటల్ దా డులు జరగడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.

డీజీపీ సుమోటోగా స్పందించి కేసులు నమోదు చేయాలని డి మాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారులు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తుంటే, కేవలం వ్యూస్ కోసం వారి వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా వార్తలు ప్రసారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.  కేంద్ర ప్రచార కార్యదర్శి శ్రీమతి శైలజ, ఐటీఐ శ్రీదేవి మా ట్లాడుతూ.. మహిళలను గౌరవించే దేశంలో మహిళా అధికారులపై ఇటువంటి దాడులు సరికాదన్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.ఆర్. రాజ్ కుమార్ మహిళా ఉద్యో గులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశా రు.

కార్యక్రమంలో క్లాస్ 4 ఉద్యోగుల సం ఘం ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, వైస్ ప్రెసిడెంట్ ఖాలెద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక శ్రేష్ట, ఏ.వి. శ్రీధర్ పాల్గొన్నారు. నిరసన అనంతరం అదనపు కలెక్టర్ ఖాదిరవన్ పళనికి వినతిపత్రం అందజేశారు. అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అదనపు కలెక్టర్ ఖాదిరవన్ పళని మాట్లాడు తూ.. మహిళా అధికారుల గౌరవం, ప్రతిష్టను కాపాడటానికి జిల్లా యంత్రాంగం క ట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ అం శంపై ఒక సమగ్ర నివేదికను అందజేయాలని, తరువాత చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు.  కార్యక్రమంలో యూ నిట్ అధ్యక్షుడు టి. రాజు, సత్యనారాయణ, దుర్గ ఫణి, కె వా సు, జోయల్, మురహరి, జయంతి, రజని, సాహితి, అమీన్ ఫాతిమా, కల్పన, స్వాతి పాల్గొన్నారు.