23-08-2025 12:32:43 AM
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
-కొత్తగూడలో ఘనంగా పనుల జాతర ప్రారంభం
మహబూబాబాద్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహ బూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో శుక్రవారం పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, హరిత హారం కార్యక్రమంలో మొక్కలు నాటారు.
అనంతరం రైతు వేదికలో పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కొత్తగూడ మండల కేంద్రంలో 12 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేశారు. తిరుమల గండి పుట్టల భూపతి గ్రామాల మధ్య పోటీ అరవై లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కోతి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గంగారం మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని, 2025 పనుల జాతర కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా, రైతు బీమా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకంలో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పారు. మహిళలు స్వయం శక్తి ద్వారా అభివృద్ధి సాధించడానికి పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సులు, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు ఇప్పిస్తున్నట్టు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం స్థానికంగా లభించే వనరులను వినియోగించుకునే విధంగా కృషి చేస్తూ, సోలార్ పంప్ సెట్లు, కోళ్ల ఫామ్ , హార్టికల్చర్, వ్యవసాయ అభివృద్ధికి దోహద పడుతున్నట్లు చెప్పారు.
యూరియా కొరత ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం
రాష్ట్రంలో యూరియా కొడతా తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపు తున్నామని, కొరత నివారణకు కృషి చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, ఆర్డీవో కృష్ణవేణి, డిఆర్డిఓ పిడి మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, డి.ఎస్.ఓ ప్రేమ్ కుమార్, ఏడిఏ శ్రీనివాస్, సిడిపిఓ నిలోఫర్ అజ్మీ, తహసిల్దార్ బాలకృష్ణ, ఎంపీడీవో మున్నార్, వివిధ శాఖల ఈఈ లు వీరభద్రం, విద్యాసాగర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.