04-08-2025 12:56:53 AM
మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం లో ఉన్న ప్రతిష్టాత్మకమైన శ్రీ బునిలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి తాళం పగలగొట్టి చోరీకి యత్నించాడు. ఆలయంలోకి ప్రవేశించిన గుత్తి తెలియని వ్యక్తి గర్భగుడి తలుపులకు బయట వైపు వేసిన తాలాన్ని పగలగొట్టినప్పటికీ, లోపల సెంట్రల్ లాక్ ఉండడంతో తలుపు తెరుచుకోలేదు.
దీనితో దొంగ తన యత్నాన్ని విరమించుకొని వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం కమిటీ సభ్యులు ఆలయానికి వెళ్ళగా తాళం పగలగొట్టి ఉన్న విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలికి చేరుకున్న రెండవ ఎస్ ఐ నరేష్ సిసి ఫుటేజీలో నమోదైన రికార్డులను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గతంలో ఆలయంలో దోపిడీ జరిగి పెద్ద ఎత్తున నగలు అపహరించారు. మళ్లీ దొంగతనానికి యత్నించడం సంచలనం రేపింది.