04-08-2025 12:58:31 AM
సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఓసి క్లబ్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిం చారు. ఓసి క్లబ్ పరిరక్షణ కోసం కొద్దిరోజు లుగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేప ట్టినప్పటికీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ ఆరోపించారు.
సోమవారం ఈ విషయంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పట్ట ణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నట్లు ఆయన తెలిపారు. పట్టణ ప్రజలు ఓసి క్లబ్ పరిరక్షణ కోసం మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, ఆబోతు అశోక్, జలగం ప్రవీణ్, మంద శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఓసి క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 4న సోమవారం రోజు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జయప్రదానికై సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నేడు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పట్టణ ప్రధాన వీధుల గుండా పలు కాలనీలలో సెంటర్లలో ప్రచారం నిర్వహిస్తూ బైక్ ర్యాలీ కొనసాగించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ మాటాడారు.
సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు వెలుగు శ్రావణ్, ఆబోతు అశోక్ జలగం ప్రవీణ్ మంద శంకర్ నాంచారి దాసు సిలువేరు వికాస్ రాగ మల్లయ్య బేతమల్ల శ్రీనివాస్ తోట రమేష్ బల్లెం శ్రీకాంత్ జడల నటరాజ్ మేక వెంకటేష్ మంద శ్రీనివాస్ వంగూరి నాగేంద్రబాబు కన్నె రాజు రాజేందర్ బోళ్ల భద్రయ్య నాగరాజు రవి షరీఫ్ గుండోజు రమేష్ నజీర్ దూర ఉపేందర్ పాల్గొన్నారు.