calender_icon.png 10 January, 2026 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించాలి

09-01-2026 12:08:04 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, జనవరి 8 : పది వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్యతో కలిసి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి వార్షిక పరీక్షలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్షిక పరీక్షకు సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, 100 శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాల సాధన దిశగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

ప్రతి విద్యా ర్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, 100 శాతం ఫలితాల సాధనకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులలో పురోగతికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్ణీత గడువులో సిలబస్ పూర్తి చేయాలని, గత విద్యా సంవత్స రంలో 96.4 శాతం ఫలితాలు సాధించడం జరిగిందని, ఈ విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో సాధించేలా అంకితభావంతో కృషి చేయాలని కోరారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని హోటల్ కుందన లో మంచిర్యాల, నిర్మ ల్ జిల్లాలకు చెందిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు, ఆదర్శ పాఠశాలల బాలికల సంక్షేమ వసతి గృహాల వార్డెన్ లకు నిర్వహించిన 2వ రోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారితో కలిసి హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి, ప్రత్యేక అధికారులు బాలికావిద్యపై ప్రదర్శించిన నాటికను అందరు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏ సి జి ఈ మల్లేశం, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు భరత్, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా సమన్వయకర్త నవీన జ్యోతి, సహాయ సమన్వయకర్త రమాదేవి, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, మాస్టర్ ట్రైనర్ జ్యోతి, పాల్గొన్నారు.