calender_icon.png 11 January, 2026 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం

09-01-2026 12:06:44 AM

నిర్మల్, జనవరి ౮ (విజయక్రాంతి): ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆదుకుంటామని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీజ అడుముల్లకు రూ.1,75,000ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఆయన అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ధర్మాజీ రాజేందర్ మాజీ ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్, లక్కాకుల నరహరి మాజీ కౌన్సిలర్, పోషెట్టి , అనుముల సంతో ష్,  అదుముల్ల నరేందర్, శ్రీధర్ మాజీ వైస్ చైర్మన్,శ్రీకాంత్ యాదవ్ మాజీ వైస్ చైర్మన్ కార్యకర్తలు పాల్గొన్నారు.