calender_icon.png 9 January, 2026 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆదివాసీ కొలవార్ దినోత్సవం

09-01-2026 12:09:11 AM

బెజ్జూర్, జనవరి 8 (విజయక్రాంతి): మండలంలోని గోల్కొండ గ్రామంలో గురువారం ఆదివాసీ కొలవార్ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ రామ్మోహన్, ఎస్త్స్ర సర్తాజ్ పాషా, మండల విద్యాధికారి డాక్టర్ సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.

కుల సంఘం నాయకులు మాట్లాడుతూ అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఈ తెగవారు అత్యంత పేదరికాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఐటిడిఏల ద్వారా 100 శాతం రాయితీపై రుణాలు మంజూరు చేసి ప్రభుత్వం ఆర్థికం గా ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, మండల అధ్యక్షులు పెద్దల సంతోష్, బుర్రి మంతయ్య, అమీర్ ఉద్దీన్, వార్డు సభ్యులు జాకీర్ హుస్సేన్, బండి సోనీ, కొడప శంకర్, మాజీ సర్పంచ్ పెద్దల సుగుణ తదితరులు పాల్గొన్నారు.