24-07-2025 01:14:06 AM
బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): తెలంగాణలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను కేంద్రం రూపొందిం చిదని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. కేంద్రం మద్దతుతో రీజనల్ రింగ్ రోడ్‌కి ప్రణాళికలు జరుగుతున్నాయని, హైదరాబాదు చుట్టూ సర్క్యులర్ రైలు లైన్‌తో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ జరగనున్నదని తెలిపారు. ఫార్మా రంగంలో మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందన్నారు.
హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో వాతావరణం అనుకూలంగా ఉంటుందని, హైదరాబాద్ పరిసరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉంటాయన్నారు. అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, ఇతర నగరాలకు వ్యాప్తి చెందాలని, టైర్ టైర్ నగరాలు అభివృద్ధి చెందాలని, దాని ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఒకే నగర అభివృద్ధి కాదని, రాష్ర్టం మొత్తం అభివృద్ధి చెందాలన్నారు. వలసలను తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అవకాశాలు కల్పించాలని, ఇదే సమయంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉండకుండా, సొంతంగా పరిశ్రమలు స్థాపించాలన్న ఆలోచనలో ఉండాలని సూచించారు.