calender_icon.png 23 December, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడిపోయిన చెట్టును పైకి లేపిన మాజీ మంత్రి

23-12-2025 02:36:51 AM

నిర్మల్, డిసెంబర్ ౨౨ (విజయక్రాంతి): రోడ్డుపై వెళ్లేవారు ఎవరికి ఏమైతే నేమి అనుకునే ఈ రోజుల్లో రాష్ట్ర మాజీ మంత్రి నేలకొరిగిన వృక్షం పట్ల మానవతల చాటి స్వయంగా నిలబెట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నిర్మల్ మండలంలోని ఎల్లెపెల్లి శివారులో రోడ్డు పక్కన ఓ వృక్షం గాలికి నేలకు ఒగిరిపోయింది. రోడ్డుపై వెళ్తున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దాన్ని గమనించి వెంటనే సిబ్బందితో అక్కడికి వెళ్లి నేలకు రాలిపోయిన వృక్షాన్ని స్వయంగా సిబ్బందితో కలిసి పైకి లేపి నిలబెట్టి వాహనంలో ఉన్న నీరును పోసి వృక్షం పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు.