04-07-2025 12:15:05 AM
కోదాడ జూలై 3 : తాను తీసుకున్న అప్పు కింద చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో ఒకరికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోదాడ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ కు చెందిన కొదుమూరి ప్రవీణ్ అనే వ్యక్తి నుండి రంగాపురపు ఉమామహేశ్వర్ అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం డబ్బు అప్పుగా తీసుకున్నాడు.
ఆ అప్పు తిరిగి చెల్లించాలని ప్రవీణ్ కోరగా పట్టించుకొని ఉమామహేశ్వర్ చివరకు 2014లో 5లక్షల రూపాయలకు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బ్యాంక్ లో చెల్లకపోవడంతో ప్రవీణ్ కోర్టు ను ఆశ్రయించాడు. సుదీర్ఘ విచారణల అనంతరం కేసును విచారించిన ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. భవ్య గురువారం తీర్పు వెలువరించారు.
ఇచ్చిన చెక్కు తాలూకా 5లక్షలు ఇవ్వాలని, చెల్లని చెక్కు ఇచ్చినందుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రవీణ్ తరుపున సీనియర్ న్యాయవాది అక్కిరాజు యశ్వంత్ రామారావు తన వాదనలు వినిపించారు.