calender_icon.png 4 July, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాల నుంచే తెలుగు, ఆంగ్లంలో పట్టు సాధించాలి

04-07-2025 12:17:02 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మోతె, జూలై 3 : విద్యార్థులు ప్రాధమిక పాఠశాల నుండే తెలుగు, ఇంగ్లిష్ భాష లలో పట్టు సాధించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం మోతె మండలం విభలాపురం ప్రాథమిక పాఠశాల, మామిళ్ళగూడెం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విభలాపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసారు.

అనంతరం నాలుగవ తరగతి  విద్యార్థులతో తెలుగు చది వించారు, విద్యార్థులు తెలుగు మంచిగా చదువుతున్నారని  కలెక్టర్ మెచ్చుకున్నారు.   నిత్యఅ వసర సరుకుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు, ప్రక్కన శిథిలావస్థలో ఉన్న పాత పాఠశాల   భవనాన్ని తీసివేయవలసిందిగా  హెడ్మాస్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ఆవరణలో వర్ష పు నీటి నిల్వలు లేకుండా మట్టి పోయించ వలసిందిగా సూచించారు.

తదుపరి మామిళ్ళగూడెం జడ్పీ హెచ్ ఎస్  పాఠశాలలో సిబ్బంది హాజరు రిజిస్టరు  పరిశీలించారు. 10 వ తరగతి  మాథ్స్ సబ్జెక్టులో పలు సమస్యలను విద్యార్థుల చేత బోర్డుపై చేయించి విద్యార్థులతో కూర్చుని విన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని, స్టాక్ రిజిస్టర్ ను కలేక్టర్ పరిశీలించారు,  విద్యార్థుల హాజరు  శాతం, భోజన  రిజిస్టర్  సరి చూశారు.

పాఠశాల పరిసరాలను, వంట గదులను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని, టాయిలెట్స్ క్లీన్‌గా  ఉంచుకోవాలని సూచించారు. తాసిల్దార్ కార్యాలయం పీహెచ్సీలను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

పలు విషయాలపై ఆరాలు తీసి సూచనలు చేశారు. ప్రాథమిక పాcఠశాల ప్రధానోపాధ్యారాలు అనురాధ, ఉపాధ్యాయులు ఉషా జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు కే.రామ నర్సయ్య, జి.వి.నరసింహారావు,  వెంకటరామిరెడ్డి, శీనయ్య, జి.నిర్మల ఉన్నారు.