calender_icon.png 29 January, 2026 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన ఏయూ విద్యార్థులు

29-01-2026 12:12:41 AM

ఘట్ కేసర్, జనవరి 28 (విజయక్రాంతి): వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీకి చెందిన 3వ సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు షాద్నగర్లో ఉన్న శ్రీ టీఎంటీ స్టీల్ ప్లాంట్  పరిశ్రమను సందర్శించారు. భవన నిర్మాణంలో ఉపయోగించే స్టీల్ తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా అవగాహన చేసుకోవడమే ఈ సందర్శన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులకు స్టీల్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల ప్రాసెసింగ్, కరిగింపు, రోలింగ్ ప్రక్రియ, థర్మో మెకానికల్ ట్రీట్మెంట్, ఫినిషింగ్ దశలు, నాణ్యత నియంత్రణ విధానాలు వంటి వివిధ దశలను వివరించారు. పరిశ్రమలో పాటించే భద్రతా ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలపై కూడా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ టీఎంటీ సంస్థ టెక్నికల్ మార్కెటింగ్ హెడ్ శ్రీ రాజీవ్ భిస్త్ ఆధ్వర్యంలో ప్లాంట్ సిబ్బంది పూర్తి సహకారం అందించారు. విద్యార్థుల సందేహాలను ఓర్పుతో నివృత్తి చేశారు. ఈ పరిశ్రమ సందర్శనకు సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పల్లవి బద్రీ మార్గదర్శకత్వం, ఇంజినీరింగ్ విభాగ డీన్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్ ప్రోత్సాహం లభించింది. అధ్యాపకులు కె. హజరత్, ఎం. మధుకర్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. విద్యార్థులకు విలువైన సాంకేతిక అవగాహన అందించినందుకు శ్రీ టీఎంటీ ప్లాంట్ మేనేజ్మెంట్ బృందానికి అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విధమైన పరిశ్రమ సందర్శనలు విద్యార్థుల సిద్ధాంత జ్ఞానాన్ని ప్రాయోగికంగా మరింత బలపరుస్తాయని యాజమాన్యం పేర్కొంది.