calender_icon.png 13 October, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారా అథ్లెట్ దీప్తికి బంగారు పతకం

13-10-2025 01:07:52 AM

మహబూబాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ పారాఅథ్లెట్ దీప్తి జీవన్‌జీ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న విర్టుస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ న్‌షిప్2025 పోటీల్లో గోల్డ్ మెడల్ గెలిచింది. 400 మీటర్ల టీ20 విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి అగ్రస్థా నంలో నిలిచింది.

ఫైనల్స్‌లో దీప్తి 55.92 సెకన్లలో రేసు ను పూర్తి చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవన్‌జీ 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. 2024 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సైతం బంగారు పతకం, 2025లో రజత పతకం సాధించింది.