17-08-2025 12:37:27 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు హైఅలర్ట్‌గా ఉండాలని రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు వివరాలపై శనివారం ప్రభు త్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఇతర ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వచ్చిన వరద ప్రవా హాలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో 454 చోట్ల సమస్య ఏర్ప డిందని, అందులో 629 కి.మీ. రోడ్డు దెబ్బతిందని, 22 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరించి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశామన్నారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వేలు, కల్వర్టులు వరద ప్రవాహం ఉందని, రాకపోకలకు ఇబ్బంది ఉన్న 108 ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన 71 చోట్ల క్లియర్ చేశామని, మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని చెప్పారు.
వాగుల వెంట 58 కి.మీ. రోడ్డు కోతకు గురైందని, అందులో 378 మీటర్లు మూసివేశామన్నారు. మొత్తంగా 147 చోట్ల కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాలని గుర్తించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇంకా రెండు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇంజినీర్లు కల్వర్టులు, లోలెవెల్ బ్రిడ్జి లు, కాజ్ వేల వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చే స్తూ.. ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అ ప్రమత్తం చేయాలని సూచించారు. అందుకు పోలీస్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఇరిగేషన్, పం చాయతీ రాజ్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రజారవాణాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు వెంటనే చేప ట్టాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రెండురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పూర్తి స్థాయి వివరాలు పంపాలని జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్లను ఆదేశించారు.
పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని మం త్రి పేర్కొన్నారు. అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్‌లోనే ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు చేరవేయా లన్నారు.