14-08-2025 01:03:53 AM
ఎల్లంపల్లికి వరద
గన్నేరుబరం చిగురుమామిడిలో నిలిచిపోయిన రాకపోకలు
జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
కరీంనగర్, రాజన్నసిరిసిల్ల కలెక్టర్లకు సూచనలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్న రోడ్లు
కరీంనగర్/సిరిసిల్ల, ఆగస్టు 13 (విజయ క్రాంతి): వర్షాల నేపథ్యంలో అధికార యం త్రాంగం అప్రమత్తమయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లోని కలెక్టరేట్లలో అత్యవసర సేవల కోసం కంట్రో ల్ రూం లు ఏర్పాటు చేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఆయా జిల్లాల్లోని కంట్రోల్ రూంలు ఈ నెల 17 వరకు 24 గంటల సేవలందించనున్నాయి. వర్షాల కోసం సహాయ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ కంట్రోల్ రూం నెంబర్ 0878-2997247 కాగా రాజన్నసిరిసిల్ల జిల్లా కంట్రోల్రూం నెంబర్ 1800-2331495, కంట్రోల్ రూంకు సంబంధించి వాట్సాప్ నెం. 9398684240, పెద్ద పల్లి, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన కం ట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
జలమయమైన రోడ్లు...
మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారు జాము వరకు కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమై పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్లోని లోత ట్టు ప్రాంతాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలి సి పరిశీలించి అప్రమత్తం చేశారు. కడెం ప్రా జెక్టు నిండి ఎల్లంపల్లిలోని ప్రవహిస్తుండడంతో అక్కడి నుంచి నేరుగా నంది పంప్ హౌస్ కు నీరు చేరుతుంది..
దీంతో అక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్ కు నీరు తరలి రావడంతో మిడ్ మానేరుకు నీటిని తరలించారు. అధికారులు ఒకేసారి మూడు పం పుల ద్వారా నీటిని విడుదల చేశారు... ఒక్కో పంపు 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్ధ్యత కలిగి ఉంటుంది.. నేపథ్యంలో మూడు పంపుల ద్వారా (0.29 టీఎంసీల )9450 క్యూసెక్కుల నీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు విడుదల చేశారు.
కాగా ఈ ప్రక్రియ వారం రోజులపా టు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా మండల కేంద్రం గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. మం డల కేంద్రంలో పెళ్లికి చేరుకోవలసిన పెళ్ళికొడుకు వాహనం వరద ఉదృతి తో ఆగిపో యింది.
రాకపోకలు నిలిపివేయడం మూ లంగా విధి లేని పరిస్థితిలో బంధువులు పెళ్ళికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకొని వెళ్లారు. చిగురుమామిడి మండలంలో కురిసిన భారీ వర్షానికి ఇందుర్తి ఎల్ల మ్మవాగు పొంగి పొర్లడంతో వంతెనపైనుం డి నీటి ప్రవాహం పెరిగి చిగురుమామిడి నుండి కోహెడ, కోహెడ నుండి కరీంనగర్ రాకపోకలు నిలిచిపోయాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షానికి బైపాస్ రోడ్డులోని వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంతం జలమయమయింది. నీటి ప్రవాహం పెరగడంతో వృద్ధ దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గోతిలో పడి గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి నుంచి ఉదయం వరకు కరీంనగర్ జి ల్లాలో 7 సెంటిమీటర్ల మేరకు వర్షపాతం నమోదయింది. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద 8.65, చిగురుమామిడిలో 9 సెంటిమీటర్లు, ఇల్లందకుంటలో 8.58 సెంటిమీ టర్లు, అత్యధికంగా మానకొండూర్ 11.95 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఇల్లంతకుంట మంలం లో 6.65 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. కందికట్కూర్ 5.88, వేములవాడలో 4.45 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 10.30 సెంటిమీటర్లు, అంతర్గాంలో 8. 16, మంథనిముత్తారంలో 8.22, జిల్లా మొత్తం గా 7.15 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లకు కేంద్ర మంత్రి బండి ఫోన్..
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ ద్వారా సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో సమన్వ యం చేసుకోవాలని కోరారు.
ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయం నుండి కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడారు. నిన్న కురిసిన వర్షంతో కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై ఆరా తీశారు.