calender_icon.png 14 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం

14-08-2025 01:02:07 AM

  1. భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దాం
  2. ఎస్పీ మహేశ్ బీ.గితే

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 13 (విజయక్రాంతి) మాధకద్రవ్యాలపై ప్రజల్లో అవగా హన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాషా ముక్త్ భారత్ అభియాన్ ఐదు వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లాలో విద్యాసంస్థల్లో మాధకద్రవ్యాల ని రోధక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పా టు చేసిన మాధకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో కల సి పాల్గొన్న జిల్లా ఎస్పీ . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...నేను మాధకద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భా గస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఎవ్వరూ డ్రగ్స్ భారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు.

అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందిస్తానని, డ్రగ్స్ రహిత స మాజాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేపించడం జరిగిందన్నారు.

డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని పిలుపునిచ్చారు.ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలు గు అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.సమాజంలో మాదక ద్రవ్యాలు స మూలంగా నిర్మూలించటలో యువత,ప్రజ లు పోలీసలకు సహకరించుటలో కీలకపాత్ర పోషించాలని కోరారు.

జిల్లాలో అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు.గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు.జిల్లాలో ఈసంవత్సరం 40 కేసులల్లో 98 మందిని అరెస్ట్ చేసిన 3.700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

గంజాయికి సంబంధించిన సబంధిత పోలీస్ సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, సి.ఐ లు నటేష్,రవి,ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి,ఎస్.ఐ లు శ్రీకాంత్, ప్రేమం నందం, జునైద్, శ్రవణ్, శ్రీనివాస్, రమే ష్,పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.