18-11-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, నవంబర్ 17 (విజయక్రాంతి) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా వెంట వెంటనే పరిష్కరించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 24 దరఖాస్తులు,మున్సిపల్ కమిషనర్లకి 4, జిల్లా ఇరిగేషన్ అధికారికి 2, సోషల్ వెల్ఫేర్ అధికారికి 2, మిగిలిన 10 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని మొత్తం 42 దరఖాస్తులు వచ్చాయన్నారు.
అలాగే నషా ముక్తా భారత్ అభియాన్ లో భాగంగా జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టుటకై ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు జిల్లాలోని విద్యాసంస్థలలో అలాగే గ్రామ స్థాయి లో ప్రతిజ్ఞ చేపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓ వేణు మాదవ్, మహిళా సంక్షేమ అధికారి కే. నర్సింహారావు, హౌజింగ్ పిడి సిధార్థ, ఇరిగేషన్ అధికారి,జడ్పీ డిప్యూటీ సి ఈ ఓ శిరీష, డి ఎస్ సి డి ఓ కే. దయానంద రాణి,డి పి ఓ యాదగిరి, డిఈఓ ఆశోక్, డి ఐ ఈ ఓ బాను నాయక్, డిఎంహెచ్‌ఓ వెంకట రమణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.