25-11-2025 12:00:00 AM
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం, నవంబర్ 24, (విజయక్రాంతి):ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.సోమవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో మారుమూల ఆదివాసి ప్రాంతాల నుంచి అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలను స్వీకరించి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సం బంధిత యూనిట్ అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని అన్నారు.
గిరిజన దర్బార్లో వచ్చి న అర్జీలు వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, పోడు పట్టాల ద్వారా రైతుబంధు రుణం ఇప్పించుట కొరకు,నిరుపేదలైన గిరిజనులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి స్వయం ఉపాధి పథకాలు ఇ ప్పించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వై ద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక భృతి కల్పించుట కొరకు, సబ్సిడీ ద్వారా ట్రైకార్ రుణాలు ఇప్పించుటకొరకు,వ్యవసాయానికి సంబంధించిన కరెం టు, బోరు, మోటారు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు ఇప్పించుట కొరకు, ఫాన్సీ, కిరాణా షాపుల రుణం ఇప్పించుట కొరకు, సోలార్ జలవిద్యుత్ ద్వారా తమ పొలాలలో బోర్ బావులు తవ్వించి కరెంట్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, ఇసుక సొసైటీల సమస్యలు పరిష్కరించుట కొరకు, గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పించుట కొరకు, పంట పొలాలలో త్రీఫేస్ కరెంటు ఇప్పించుట కొరకు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు దరఖాస్తులను సమర్పించారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలను ప్రత్యేకమైన రిజిస్టర్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసి ,అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నా రు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్,ఆర్ సి ఓ గురుకులం అరు ణ కుమారి, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు,ఏవో సున్నం రాంబాబు,డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్,ఏపీవో పవర్ వేణు, పీ వి టీజీ అధికారి గన్యా,మేనేజర్ ఆదినారాయణ, హెచ్ ఈఓలింగానాయక్,ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ మరియు వివిధ శాఖల సిబ్బంది మోహన్, భార్గవి,జోగారావు తదితరులు పాల్గొన్నారు.