calender_icon.png 25 November, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

25-11-2025 12:00:00 AM

- గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ డిమాండ్

- టేకులపల్లి, నవంబర్ 24, (విజయక్రాంతి):కేంద్ర ప్రభుత్వం 29కార్మిక చట్టా లను 4లేబర్ కోడ్ లు గా మారుస్తూ శనివారం దేశవ్యాప్తంగా అమలులోకి తెస్తున్న ట్టు ప్రకటన విడుదల చేయడం పట్ల ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాలు మారుస్తూ కార్మికులకు అందాల్సిన అలవెన్సులు, ప్లేడే లు తదితర సౌక ర్యాలను కాలరాస్తు పెట్టుబడిదారులకు అనుకూలంగా 12గంటలకు పైగా పని చె య్యాలని కార్మికుల మీద లేబర్ కోడ్ ల రూపం లో పని గంటల ఒత్తిడి తీసుకొస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరు పట్ల పిట్ కార్యదర్శి మధు కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా యూనియన్ అగ్ర నాయకత్వ ఆదేశానుసారం టేకులపల్లి మండలం సింగరేణి కొయగూడెం ఓసిలొ కార్మికులతో ధ ర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ ఇల్లందు ఏరి యా బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు, పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాల క్రితం అనేక పోరాటాలు చేసి సాధించిన హక్కులను కాలరాసేలా బీజేపీ ప్రభు త్వం నాలుగు లేబర్ కోడ్ లు అమలులోకి తెస్తున్నదని దీని వల్ల కార్మికులు అనేక హక్కులు కోల్పోనున్నారని తెలిపారు. పెట్టుబడి దారులకు అనుకూలంగా చట్టాలను మార్చి తెస్తున్నందు వల్ల దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోనున్నారని తెలిపారు.

సమ్మెహక్కు కోల్పోవడం, గ్రాట్యుటీ చట్టం, బోనస్ చట్టం, అలవెన్సులు వంటి అనేక హక్కులు కోల్పోతారని కాబట్టి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత చట్టాలనే కొనసాగించాలని లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని జేఏసీ గా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

 అనంతరం కెఒసి మేనేజర్ పేరాల శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సహయ కార్యదర్శి షెక్ సర్వర్, అజ్మిరా కిషోర్, సామల శ్రీనివాస్, కరుణశంకర్, దల్సింగ్, కనకరాజు, శ్యామ్ సుందర్, హతిరామ్, హీరాలాల్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.