calender_icon.png 23 May, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో కారు ఢీ.. ఇద్దరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు

23-05-2025 01:24:54 AM

జయశంకర్ భూపాలపల్లి, ( మహబూబాబాద్) మే 22 (విజయ క్రాంతి): సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న కారు, పుష్కర స్నానానికి వెళుతున్న ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ మేడిపల్లి అటవీ ప్రాంతంలో రహదారిపై గురువారం జరిగింది.

హైదరాబాదుకు చెందిన ఓ కుటుంబం కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి కారులో భూపాలపల్లి వైపు వస్తుండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక శివారు కుమ్మడి పల్లి గ్రామానికి చెందిన మా కుటుంబం ఆటోలో పుష్కర స్నానానికి వెళుతుండగా ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో, కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు గాయపడ్డారు.

గాయపడ్డ వారిని భూపాలపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కుమ్మరపల్లికి చెందిన శ్రీరాముల విష్ణు(21), పాల రజిత (32)  మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు.

గాయాలైన ఎండి అజిత్, గుంటుక నరసింహ, గుంటుక సరోజన, శ్రీరాముల విహన్, గుంటుక సంధ్య, శ్రీరాముల శోభ ను భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు పుష్కర స్నానం ఆచరించిన, ఇటు పుష్కర స్నానం ఆచరించినందుకు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించడం మరికొందరు గాయాల పాలవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.