calender_icon.png 23 May, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్‌ను తక్షణమే ఆపాలి

23-05-2025 01:23:12 AM

ప్రజా సంఘాల డిమాండ్

సిద్దిపేట, మే 22 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్, కర్రేగుట్టలను తక్షణమే ఆపాలని, సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నాంబాల కేశవరావును హత్య చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం మావోయి స్టులతో శాంతి చర్చలు జరపాలంటూ సిద్దిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బాడ్జిలు ధరించి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూ దేశంలో మావోయి స్టుల నిర్మూలన పేరుతో భాజపా ప్రభుత్వం అడవులలో ఉన్న సహజ సిద్ధమైన వనరు లను కార్పొరేట్, బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడం కోసం ఆదివాసులను హతమారుస్తున్నారని, మహిళల పై అత్యా చారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. 

ఆదివాసుల హక్కుల కోసం, అడవుల లోనీ సహజ సిద్ధమైన వనరుల పరిరక్షణ కోసం దశాబ్దాల కాలంగా ఉద్యమిస్తున్న మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కక్షపూ రితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అనేకమంది అమాయకపు ఆదివాసీ మహిళ ల పై అత్యాచారం చేస్తూ, ప్రశ్నిస్తున్న వారిని ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా రన్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయిలో ఉండి వచ్చే సంవ త్సరం మార్చి కల్లా నక్సలైట్లను నిర్మూ లిస్తామని ప్రకటించడం అత్యంత సిగ్గుచేట న్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్, కర్రెగు ట్టలను ఆపి, కేంద్ర బలగాలను వెనక్కి పం పాలని, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. 

పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రాగుల భూపతి, ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ సత్తయ్య, పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్, దళిత బహుజన, ప్రజా సంఘాల నాయకులు భీమసేన, రోమాల బాబు, కెఎన్పిఎస్, పిడిఎం, డిబిఎఫ్ , బీడీఎస్‌ఎఫ్, రైతు సంఘాల నాయకులు మొగిలి భిక్షపతి, కమలాకర్, కొమ్ము దుర్గారాములు, దబ్బేట ఆనంద్, యాదగిరి, శేఖర్, న్యాయవాది విజయ్ కుమార్, రాజు, రిటైర్డ్ టీచర్ నర్సింలు పాల్గొన్నారు.