23-05-2025 01:25:05 AM
గజ్వేల్,మే 22 : పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను సద్వినియోగం చేసుకొని సేంద్రీయ పద్ధతిలో పంటలు సాగు చేయాలని గజ్వేల్ వ్యవసాయ అధికారి నాగరాజు రైతులకు సూచించారు. గురువారం గజ్వేల్ ఆగ్రోస్ సేవా కేంద్రంలో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులైన జనుము విత్తనవిక్రయాలను ఆయన ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ 50 క్వింటాళ్ల జన్మ విత్తనాలు గజ్వేల్ లో అందుబాటులో ఉన్నా యని, రైతులు సద్వినియోగం చేసుకొని సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. జన్మ విత్తనాలు కావలసిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ తీసుకొని ఆయా గ్రామాల ఏఈఓ నుండి టోకెన్ తీసుకువెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పాల్గొన్నారు.