14-10-2025 05:47:14 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 12వ వార్డులో సబ్ స్టేషన్ ఏరియాలోని మౌలానా ఇంటి నుండి బండారి రవికుమార్ ఇంటి వరకు రూ.4 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం మాజీ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బస్తి పెద్దలు మౌలానా, ఈగ నరసయ్య, దుండ్ర రవికుమార్, బంక కుమార్, రాము, బాబా, నియాజ్, గురజాల రాజు, ఆసిఫ్, ఠాగూర్ సునీత బాయి, ఠాకూర్ రమాదేవి, ఆకుల విజయలక్ష్మి, అస్మాకౌసర్ తదితరులు పాల్గొన్నారు.