calender_icon.png 19 July, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్సార్సీపీకి అవంతి గుడ్‌బై

13-12-2024 01:43:20 AM

రాజీనామా లేఖను జగన్‌కు పంపిన శ్రీనివాస్

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): వైఎస్సార్సీపీ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు.

గడిచిన ఐదేళ్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పడినట్టు వివరించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని సూచించారు. కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలు కూడా కాకుండానే ధర్నాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని హితవు పలికారు. తాడేపల్లిలో కూర్చొని ఆదేశించడంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తల గురించి కూడా జగన్ ఆలోచించాలని ఆయన సూచించారు.