calender_icon.png 19 July, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్

13-12-2024 01:47:17 AM

ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): అద్భుతమై న వనరులు ఉన్న హైదరాబాద్ నగరం డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రంగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ ప్యాక్‌కాన్ 2024 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందు కు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టంచేశారు.

అందులో భాగంగానే ఇటీవల ఎంఎస్‌ఎంఈ పాలసీ ప్రవేశపెట్టామన్నారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపా రు. యువతలో నైపుణ్యాభివృద్ధి ఎంతో కీలకంగా మారింద ని, దానికోసమే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చే స్తున్నామని స్పష్టం చేశారు.

స్కిల్ వర్సిటీ నిర్వహణలో ప్రభుత్వానికి సహకరించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్కిల్ వర్సిటీలో 80 శాతం సిబ్బంది పారిశ్రామిక రంగానికి చెందిన వారే ఉన్నారని, అం దులో పరిశోధన ఆధారిత శిక్షణ అందిస్తున్నట్టు వెల్లడించారు.