calender_icon.png 8 July, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పల్లా’ను పరామర్శించిన ‘కొమ్మూరు’

08-07-2025 01:18:37 AM

చేర్యాల, జులై 7:  ఎప్పుడు ఉప్పు నిప్పుల ఉండే రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడానికి పల్లా నివాసం వేదిక అయింది. ఎప్పుడు రాజకీయంగా  విమర్శకు ప్రతి విమర్శ చేసుకునే నాయకులు కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అరుదైన దృశ్యం హైదరాబాదులోని పల్లారాజేశ్వరి రెడ్డి నివాసంలో చోటుచేసుకుంది.

ఇటీవల ప్రమాదానికి గురై, కాలుకి శాస్త్ర చికిత్స చేసుకొని, ఆయన నివాసంలో  విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే పల్లా  రాజేశ్వర్రెడ్డిని జనగామ డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరు ప్రతాపరెడ్డి పరామర్శించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఈ అరుదైన దృశ్యం చూసిన నియోజకవర్గ ప్రజలకు చర్చనీయాంశంగా మారనున్నది. కొమ్మూరి వెంబడి చేర్యాల పట్టణ నాయకులు దాసరి శ్రీకాంత్, పురుమ ఆగం రెడ్డి, రంగు శంకర్ గౌడ్, అందే నాని తదితరులు పాల్గొన్నారు