08-07-2025 01:19:43 AM
- 108 ను వెంటాడుతున్న కష్టాలు
- అరిగిన టైర్లు.. వెలగని లైట్లు
- అత్యవసర సమయంలో మొరాయిస్తున్న వాహనాలు ఇబ్బందుల్లో రోగులు
మణుగూరు, జులై 7 ( విజయ క్రాంతి ) : రోడ్డు ప్రమాదమైనా, అస్వస్థతకు గురైనా, పురిటి నొప్పులు పడుతున్నా కళ్లముందు ఎవరైనా మృత్యువుతో పోరాడుతున్నా ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో పూర్తి సరంజామాతో వాలిపోయి.. పోతున్న ప్రాణాలను పట్టి జీవితాల ను నిలబెట్టిన ప్రాణదాత ఈ వాహనం.
ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ 108 సేవలకు నియోజకవర్గంలోని పలు మండలాలలో అపర సంజీవ ని 108 వాహనాలకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఎవరికైనా ఆపదొస్తే నిముషాల వ్య వధిలోనే క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్న 108 వాహనాలు అర కొర సేవలకే పరిమితం అవుతున్నాయి.
సకాలంలో ఆసుపత్రులకు చేరాలనుకుంటున్న సామాన్యులకు ఈ వాహనాల ద్వారా చుక్క లు కనిపిస్తున్నాయి.108 ను వెంటాడుతున్న కష్టాలు నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, అశ్వాపురం మండల ప్రజలకు సేవ లు అందించే ఈ వాహనాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ప్రస్తుతం పలు వాహ నాలు మేజర్, మైనర్ మరమ్మతులు గురై ము క్కుతూ మూలుగుతూ ముందుకు సా గుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బంది వీటిని నడిపిస్తున్న దుస్థితి ఏర్పడింది.అత్యవసర సమయంలో మో రా యిస్తున్న వాహనాలు 108 వాహనాలలో కొన్ని మాత్ర మే కొత్తవి కాగా మిగిలినవి పా తవి కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
ప్రమాదం బా రినప డి ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను, అనారోగ్యానికి గురై ఆపదలో ఉన్నవారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించే 108 వాహనాలు అస్తమానూ మరమ్మతుల కు గురవుతున్నాయి. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రస్తుతం అంబు లెన్సులు వివిధ మరమ్మతులకు గురై ఆపసో పాలు పడుతున్నాయి.
బాధితులను అత్యవసరంగా తరలించే సమయంలో మార్గ మ ధ్యంలో నిలిచిపో తున్నాయి. సిబ్బంది సమన్వయంతో మరో వాహనం నుం చి బాధితు లను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పాతవి కావడంతో ఎప్పుడు.. ఎక్కడ ఏ సమయం లో ఆగిపోతాయో తెలియక సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
తరసు సమస్యలే...
పినపాక, అశ్వాపురం, కరకగూడెం, మండలాల ఉన్న వాహ నాలు.ఎప్పుడు ముందుకు కదులుతాయో, ఎప్పుడు మోరా యిస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆయా ఆస్పత్రి పరిధిలో సేవ లు అందిస్తున్న వాహనాల్లో సగం తరచూ వివిధ మరమ్మతులకు గురౌతున్నాయి. వా హనాలకు ఎప్పుడు రిపేర్లు వస్తాయో తెలియడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
మ రమ్మతులకు గురైతే రోజుల తరబడి బాగు కావడం లేదు. పక్క మండలాల నుంచి వా హనం వచ్చే వరకూ క్షతగాత్రులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా వాహనాల్లో ఇఎంటీలుగా మహిళలు పని చేస్తు న్నారు. అర్ధరాత్రి సమయాల్లో వాహనాలు రిపేర్లు వస్తే కనీసం బాగు చేసుకునేందుకు అవకాశం ఉండడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యాలను నిర్ధేశిస్తున్న యాజమాన్యం రోజు కి 4, నెలకు 120 కేసులకు తప్ప నిసరిగా హాజరుకావాలని నిర్వహణా సంస్థ సిబ్బందికి లక్ష్యాలను నిర్ధేశించి వేధింపులకు గురిచే స్తుందని సిబ్బం ది ఆరోపిస్తున్నారు. ఒకవేళ టార్గెట్ చేరుకోకపోతే వేధిం పులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేసేదేమీ లేక సిబ్బంది కేసుల టార్గెట్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మార్గం మ ధ్యలో వాహనాలు మరమ్మతులకు గురైతే డ్రైవరే మరమ్మత్తులు చేపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.కొన్ని 108 వాహనాలు పూర్తిగా మూలనపడగా, మరి కొన్ని పాత వాహనాలు అరిగిన టైర్లు, వెలగని లైట్లతో ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నాయి.
ఇబ్బందుల్లో రోగులు..
అంబులెన్స్ సౌకర్యం సకాలంలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, రోడ్డు ప్రమాద బాధితు లు, గుండె జబ్బులు వంటి అనేక మంది బా ధితులకు అత్యవసర వైద్య సేవలు కోసం ప్రాణాలు రక్షించు కునేందుకు అంబులెన్స్ కోసం గంటల కొద్దీ వేచి చూస్తున్నారు.
అత్యవసర పరిస్థితులలో గత్యం తరం లేక ప్రైవే టు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులకే ఇబ్బందులు పడుతున్న పేద లకు.. ప్రైవేటు వాహనాల కిరాయిలు మరిం త భారంగా మారుతున్నాయి. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటంలో సమయమే కీలకం.
సకాలంలో అంబులెన్స్ రాక ప్రాణాలు పో యిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అన్ని మండలాలలో ఉచిత 108 అంబులెన్స్ వాహనాల సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.