08-07-2025 01:20:23 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటేల్ గూడలో రూ.1.10 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
పటాన్ చెరు, జులై 7 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామపంచాయతీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
విలీన గ్రామాల పరిధిలో ఏర్పడుతున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధిదీపాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.
కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్,
మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈ ప్రవీణ్, సీనియర్ నాయకులు గోపాల్, కృష్ణ, శ్రీకాంత్, గోవింద్, కాలనీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
గణేష్ గడ్డ దేవాలయం అభివృద్ధికి కృషి
పటాన్ చెరు మండల పరిధి రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి గుడి అభివృద్ధి పై సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గుడికి నాలుగు వైపుల నిర్మిస్తున్న రాజగోపురం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీటీసీ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, శ్రీనివాస్, నాగరాజు, తదితరులుపాల్గొన్నారు.