08-07-2025 01:16:58 AM
పటాన్ చెరు, జులై 7 : ప్రమాదవశాత్తు మెడకు టవల్ బిగుసుకొని బాలిక మృతి చెందిన ఘటన పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో సోమవారం జరిగింది. పటాన్చెరు ఎస్త్స్ర మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిట్కుల్ గ్రామానికి చెందిన వడ్ల నరసింహ చారి, అతని భార్య బయటకు వెళ్లడంతో కూతురు సహస్ర (9), తమ్ముడు గణేశ్ ఈశ్వర్ లు మరియు కలిసి ఆడుకుంటున్నారు.
ఈ క్రమంలో ఫ్యాన్ రెక్కకు టవల్ కట్టి సహస్ర మెడకు వేసుకుంది. అదే సమయంలో కరెంటు రావడంతో మెడకు టవల్ బిగుసుకొని ఊపిరి ఆడక సహస్ర మృతి చెందినట్లు తెలిపారు. బాలిక తండ్రి వడ్ల నరసింహాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.