13-01-2026 12:00:00 AM
మఠంపల్లి, జనవరి 12: వారానికి మించి జ్వరం, దగ్గు విపరీతంగా వస్తూ ఉంటే తెమడ పరీక్షలు చేయించుకోవాలని టీవీ నోడల్ ఆఫీసర్ జి.ప్రభాకర్ తెలిపారు. మఠంపల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్స్‌లో సోమవారం టిబిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టిబి పరీక్షల అనంతరం నోడల్ ఆఫీసర్ జి. ప్రభాకర్ మాట్లాడుతూ చలికాలం దృష్ట్యా పిల్లలు పెద్దలు అజాగ్రత్తగా ఉండకూడదని ఎక్కువగా దుమ్ములో పనిచేసేవారు ముఖానికి మాస్కులు ధరించాలని వారానికి మించి దగ్గు జ్వరం విపరీతంగా వస్తున్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెమడ పరీక్షలు చేయించుకోవాలని అశ్రద్ధ చేయొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రవికుమార్, ల్యాబ్ వి.రమేష్, ఎం సి హెచ్ పి లోకేశ్వరి, ఏఎన్‌ఎంలు ఎం.భూదేవి, సిహెచ్ ప్రియాంక, ఆశ కార్యకర్తలు జి.జ్యోతి, పి.ఉమా సాగర్ సిమెంట్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.