13-01-2026 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి12: సమాజంలో నేటి యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని జాజిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శులు దేవులపల్లి నవీన్ రెడ్డి, మాగి నాగయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, వల్లాల ఖాజా నాయకులు బొల్లం సైదులు, ఎల్లెంల కొమురెల్లి, కుంభం సత్తయ్య, సత్తిరెడ్డి, లింగయ్య, నరహరి, వీరయ్య, వెంకన్న, మహేష్ పాల్గొన్నారు.