calender_icon.png 7 February, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ విద్యా సందర్శనలో విజన్ పాఠశాల విద్యార్థులకు అవగాహన

07-02-2026 12:00:00 AM

వెంకటాపురం(నూగూరు) ఫిబ్రవరి6(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం విజన్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్  బాహుబలేంద్రుని వెంకటరామారావు నేతృత్వంలో,విద్యార్థులను సమీపంలోని మొక్కజొన్న పంట వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మొక్కజొన్న పంట నిర్మాణం,విత్తనం, మొలకెత్తే విధానం,పంట సాగు విధానం గురించి,అన్నదాత, కర్షకులు మరియు వ్యవసాయ కూలీలు పడే కాయ కష్టం గురించి ప్రత్యక్షంగా వివరించారు. అలాగే ఆహార ధాన్యాల విలువ,దేశానికి వెన్నుముఖ అయినా కర్షకుని ప్రాముఖ్యతవ్యవసాయ రంగం,మన జీవితానికి ఎంత ముఖ్యమో విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కల్పించారు.

అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ రంగానికి చెందినవారే నని గుర్తుచేస్తూ, వారి కష్టానికి గౌరవం ఇవ్వడం,ఆహారాన్ని వృథా చేయకూడదనే భావనను విద్యార్థులలో నాటే ప్రయత్నం చేశారు. మనం ప్రతి ఒక్కరం బతాంగ కుటుంబాల నుండి వచ్చిన వారమేనని,రైతే రాజు అని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దమ రాణి,నాగమణి,శ్రీనివాసులు పాల్గొన్నారు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు విజన్ స్కూల్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠ్యాంశాలతో పాటు ప్రాయోగిక విద్యకు ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సందర్భంగా విజన్ పాఠశాల నిర్వహకులు బాహుబలేంద్రుని వెంకటరామారావు తెలిపారు.