calender_icon.png 7 February, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు

07-02-2026 12:00:00 AM

అభినందించిన ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజ్

సికింద్రాబాద్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): రోడ్డుపై గుంతలతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై కంటోన్మెంట్ బోర్డు, రక్షణ శాఖ సంబంధిత అధికారుల స్పందనకు ఎదురు చూడకుండా ట్రాఫిక్ పోలీసులే కార్మికులయ్యారు.గత కొన్ని నెలలుగా కంటోన్మెంట్ పరిధిలో రోడ్లుపై తీవ్ర ఇబ్బందులకు వాహన దారు లు గురవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు సెంటర్ పాయింట్ రోడ్డుపై గుంతలను మట్టి తెప్పించి పెద్ద పెద్ద గుంతలను పూడ్చి వాహన దారులు ఇబ్బందులను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజుశ్రమదానం చేసిన ట్రాఫిక్ పోలీసులనుఅభినందించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారుల తో ఏసిపి శంకర్ రాజ్ మాట్లాడి గుంతలను శాశ్వతంగా రోడ్డు వేసి ప్రమాదాలను నివారించాలని అధికారులకు కోరారు.ఈ కార్యక్ర మంలో ట్రాఫిక్ ఎస్సై దేవి దాస్, మహేష్ ,నసీరుద్దీన్ సయ్యద్ మియా, మహేందర్ సిబ్బంది తదితరులు ఉన్నారు.