calender_icon.png 13 August, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిడ్స్ నివారణకు అవగాహనే ముఖ్యం

13-08-2025 12:25:42 AM

కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): గతంతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఎయిడ్స్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదిలాబాద్ లోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. యువతకు హెచ్.ఐ.వి  ఎయిడ్స్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో అక్టోబర్ 31 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మేర కు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... ఎయిడ్స్ సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల పట్ల విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

మెడికల్ సిబ్బంది సైతం పూర్తి అవగాహన కలిగి ఉండాలని, హాట్ స్పాట్స్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడు తూ.... జిల్లాలో ప్రస్తుతం 0.3 శాతం ఎయి డ్స్ పాజిటివ్ కేసులు ఉన్నాయని, గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గిందన్నారు. వ్యాధి నివారణ చర్యలపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.

వ్యాధి సంక్రమించినవారు ఆత్మ స్థైర్యం కోల్పోకుం డా క్రమం తప్పకుండా మాత్రలు తీసుకుంటూ వ్యాయామం చేయాలని సూచిం చారు. అనైతిక లైంగిక చర్యల వల్ల వ్యాధి సోకుతుందని, రక్తం ట్రాన్స్ఫర్ చేసే సమయంలోనూ పూర్తి పరీక్షలు చేయించు కోవాలన్నారు. ఎయిడ్స్ పరిక్షలతో పాటు.... ఉచితంగా వైద్య చికిత్సలను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.