calender_icon.png 3 July, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో డీఏపీ, యూరియాపై అవగాహన సమావేశం

02-07-2025 05:04:46 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి పట్టణ రైతు వేదికలో నానో టెక్నాలజీకి సంబంధించి నానో యూరియా, డిఏపిల కరీంనగర్ జిల్లా స్థాయి అవగాహన  సమావేశము  వ్యవసాయ శాఖ, కోరమండల్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి కె.భాగ్యలక్ష్మి(District Agriculture Officer K. Bhagyalakshmi) హాజరై మాట్లాడుతూ... వానాకాలంలో సాగు చేసే వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు 25 నుండి 50% వరకు వరకు ఎరువులను తగ్గించుకొని నానో యూరియా, డిఏపిలను పదిహేను రోజుల వ్యవధిలో పంటలపై రెండుసార్లు నానో యూరియా, డిఏపిలను పంటలపై పిచికారి చేసుకొని పంట దిగుబడి పెంచుకోవాలని, నానో టెక్నాలజీతో ఎరువుల వినియోగన్ని రైతులు తగ్గించుకోవాలని అన్నారు. అలాగే రైతులకు  వ్యవసాయ అధికారులు అందరు అవగాహన కల్పించాలని సూచించారు.

అలాగే ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శేఖర్, డిస్టిక్ హార్టికల్చర్, సెరికల్చర్ ఆఫీసర్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ... నానో యూరియా, డిఏపిలను ఉద్యాన పంటలపై కూడా వాడుకోవచ్చని సూచించారు. తదుపరి కోరమండల్ కంపెనీ ప్రతినిధి పి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ...  డిఏపి, యూరియాల తయారీకి విదేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో దేశీయంగా తయారైన నానో యూరియా, డిఏపీలను వాడుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లాలోని ఏడిఏలు మండలాల వ్యవసాయ అధికారులు, సాంకేతిక వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు శిక్షణ కేంద్రం కరీంనగర్ ఏడిఏ, ఏవోలు,  ఉద్యాన శాఖ అధికారులు, కరీంనగర్ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెద్ది లక్ష్మీనారాయణ, కోరమాండల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రెడ్డి, సీనియర్ జోనల్ మేనేజర్ సజన్ కుమార్, మేనేజర్ కె నరేష్ పాల్గొన్నారు.