22-08-2025 12:38:19 AM
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాం తి): ‘బీఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్న ట్టుగా నాపై కక్షగట్టారని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమా వేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు.
రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్ర చేస్తున్నారని తెలిపారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరి ధిలో ఉన్న సింగరేణి కార్మికులకు గురువా రం కవిత బహిరంగ లేఖ రాశారు. “బీఆర్‌ఎస్‌లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాల మీద నా తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
కార్మికులకు అండగా ఉంటా
‘టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి లో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబం లో సభ్యురాలిగా వెన్నంటే ఉంటాను. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు గా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్ష లు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది’ అని ఆ లేఖలో రాశారు.