22-08-2025 12:15:13 AM
బోయినపల్లి: ఆగస్టు 21 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం గోదావరి జలాలతో కళకళలాడుతుంది. గత ఏడాది సై తం ఇదే నెలలో జలాశయం ఇదే సామర్థ్యంతో ఉన్నట్లు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా వరద కాలువ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం కు గోదావరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నీరు ఇన్ఫ్లో ద్వారా రావడం తో జలాశయం జలకళ సంతరించుకున్నది.
ఒక వైపున రైతుల సంతోషo నెలకొనగా ప్రాజెక్టును సందర్శకులు ప్రజలు చూడడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 14000 క్యూ సేకుల నీరు రాగా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గా యత్రి పంప్ హౌస్ నుంచి 3150 క్యూసెక్కుల జలాలు రాగా ప్రస్తుతం జలాశయంలో 15. 6 36 టీఎంసిల నీటి నిల్వ ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
శ్రీ రాజరాజేశ్వర జలాశ యం సామర్థ్యం 27. 55 టీఎంసీల గాను 15.636 టీఎంసీల నీటి నిల్వకు చేరింది. దీంతో సగానికి పైగా నిలువ వున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పీ నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. జలాశయం నీటి నిలువ పెరగడ నున్నది.