calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

26-11-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, నవంబర్ 25 (విజయక్రాంతి): చర్లపల్లి అగ్నిమాపక కేంద్రం నుండి అగ్నిమాపక అధికారి కె. చంద్రశేఖర్, సునీల్ కేతిరెడ్డి లీడింగ్ ఫైర్ ఫైటర్, సి.హెచ్. శ్రీశైలం ఫైర్ ఫైటర్ టెక్నికల్, వి. శ్రీనివాస్ ఫైర్ ఫైటర్, బి. మురుగేష్ కుమార్ ఫైర్ ఫైటర్ పై వారందరూ ఘట్ కేసర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో  మంగళవారం అగ్నిమాపక ప్రమాదాల గురించి అవగాహన సదస్సును నిర్వహించినారు.

ఇందులో భాగంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్  విద్యార్థులకు ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్, ఫైర్ ట్రయాంగిల్, క్లాసెస్ ఆఫ్ ఫైర్స్, టైప్ ఆఫ్ ఫైర్స్ గురించి మన పరిసర ప్రాంతాల్లో కంబస్టబుల్, ఆయిల్, గ్యాస్, మెటల్ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని వివిధ రకాల ఫైర్ ఎక్స్టింగ్ విషెర్స్ వాడి ఏవిధంగా నిర్మూలించవచ్చు అను విషయాలను సవివరంగా వివరించారు.