26-11-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 25: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ అన్నారు. తులేకలాన్ గ్రామంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా లబ్దిదారులకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీ మల్లేష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ జక్కుల మల్లేష్, భాగ్యమ్మ, గంగమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.