26-11-2025 12:00:00 AM
హెలెన్ కెల్లర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిర జిల్లాలోని మానసిక దివ్యాంగులు, చెవి టి, మూగ, అంధ విద్యార్థుల కోసం జిల్లాస్థాయి ఆటల పోటీలను బుధవారం ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్థానిక పాఠశాల హెలెన్ కెల్లర్ కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా రు. జూనియర్ గ్రూపుగా సంవత్సరాల లోపు, సీనియర్ గ్రూప్ 18 సంవత్సరాల వరకు ఉన్న దివ్యాంగులకు పోటీలను నిర్వహిస్తున్నారు.
ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి పాల్గొంటారని హెలెన్ కెల్లర్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఉమర్ ఖాన్ తెలియజేశారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో దాదాపు 500 నుం చి 700 మంది దాకా విద్యార్థులు పాల్గొంటారని, రామకృష్ణాపురంలోని బిఆర్ అంబే ద్కర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో పోటీలు నిర్వహిస్తూ నిర్వహిస్తున్నారని జిల్లా సంక్షేమ అధి కారి శారద తెలియజేశారు. విజేతలకు రాష్ట్రస్థాయిలో జరుగే దివ్యాంగుల ఆటల పోటీ లలో పాల్గొనేలా తయారు చేస్తామన్నారు. దాదాపు 10 నుంచి 15 పాఠశాలల విద్యార్థు లు పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు.