23-12-2025 01:37:45 AM
కొత్తపల్లి, డిసెంబర్ 22(విజయక్రాంతి): భగవతి హై స్కూల్లో గణిత దినోత్సవం మరియు రైతు దినోత్సవాన్ని విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్కిట్లు, నృత్య ప్రదర్శనలు, గీతాల ద్వారా గణిత శాస్త్రం ప్రాముఖ్యతను మరియు రైతుల సేవలను చక్కగా ప్రతిబింబించారు.ఈ సందర్భంగా భారతదేశపు గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర, ఆయన గణితానికి చేసిన విశేష సేవలను విద్యార్థులు వివరించారు.
అలాగే రైతు దినోత్సవం సందర్భంగా రైతుల కష్టాలు, వారి ప్రాధాన్యతను తెలియజేస్తూ సందేశాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ మెప్పించాయి.ఈ కార్యక్రమానికి పాఠశాల అకడమిక్ డైరెక్టర్ సి. ప్రతాప్ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ పి. రామ్ మోహన్ రావు హాజరై కార్యక్రమాన్ని వీక్షించి విద్యార్థులను అభినందించారు.