calender_icon.png 19 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జేఏసీ సంఘాల బంద్ విజయవంతం

18-10-2025 07:43:02 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు బీసీల హక్కులను కాలరాసే విధంగా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే వచ్చేలా చేశారని రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాల నాయకుల పిలుపుతో శనివారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐక్య బీసీ సంఘాల నాయకులు  అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42 % చట్టసభల్లో  సముచిత స్థానాన్ని కల్పించాలన్నారు. పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బీసీ లకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపు రాజ్యాంగంలో  మెజారిటీ ప్రజలకు న్యాయం చేయాలని రిజర్వేషన్స్ కల్పిస్తే కొందరు అడ్డు పడటం అన్యాయమని వివరించారు. కాగా, పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సీఐ రమణ మూర్తి, ఎస్సై సురేష్ లు బందోబస్త్ నిర్వహించారు.