calender_icon.png 1 May, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మికుంట కాకతీయ విద్యార్థుల ప్రభంజనం

30-04-2025 08:25:05 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని కాకతీయ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థ చైర్మన్ ఆవిర్నేని సుధాకర్ రావు విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారబోయిన అద్విత శ్రీ అనే విద్యార్థినికి 600 మార్కులకు గాను 590 రాష్ట్రస్థాయి మార్కులు సాధించిందని తెలిపారు.

589, 587, 586, 584, 583, 582 మార్కులు సాధించి కాకతీయ స్కూల్ స్థాపించిన నాటి నుండి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించి గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్న ఘనత కాకతీయ విద్యాసంస్థలదే అని అన్నారు. ఈ ఫలితాలకు సహకరించిన విద్యార్థులకు వారి తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో కూడా కాకతీయ విద్యాసంస్థల్లో ఇదే స్పూర్తితో మరింత ఉన్నత ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.