20-09-2025 06:53:40 PM
పూలతో పండగ స్కూల్ విద్యార్థుల బతుకమ్మ ఆనందం...
సాంప్రదాయ వేషాధారణలో విద్యార్థుల సందడి..
అమీన్ పూర్,(విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి హై స్కూల్ ప్రాంగణంలో కరస్పాండెంట్ రమేష్ బాబు ఆధ్వర్యంలో శనివారం దసరా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో విద్యార్థులు బతుకమ్మ పేర్చి చక్కని ఆటపాటలతో బతుకమ్మ గీతాన్ని ఆలపించి బతుకమ్మ పండుగ ఫెస్టివల్ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ... సాయి హై స్కూల్లో ప్రతి ఏటా దసరా బతుకమ్మ సంబరాలు అంగ రంగ వైభవంగా నిర్వహిస్తాం, తిరొక పువ్వులతో విద్యార్థులు బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాటంతో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తాం. సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు చాలా సందడి చేయడం జరిగింది. సాంప్రదాయ రంగులు పూల బతుకమ్మలతో పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణంగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల ప్రత్యేక నృత్యాలు పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. అందరూ కలిసికట్టుగా బతుకమ్మను ఎత్తిపాడుతూ ఐక్యతను చాటుకున్నారు. సంతోష కేరింతలు విద్యార్థుల అర్షద్వానాలతో పాఠశాల సందడి చేసింది.