20-09-2025 06:55:40 PM
అలంపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్ చెందిన భక్తులు గద్వాల జిల్లా అలంపూర్ లో వెలసిన ప్రముఖ ఐదవ శక్తిపీఠం నుంచి అఖండ జ్యోతితో పాదయాత్రగా బయలు దేరారు. సోలాపూర్ కు చెందిన సిద్దేశ్వర మహారాజ్ నవరాత్రుల మండలి సభ్యులు దేవీశరన్నవరాత్రులను పురస్కరించుకొని దేశం నలుమూలల ఉన్న ప్రముఖ శక్తి పీఠాల నుండి అఖండ జ్యోతిలతో పాదయాత్రగా తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టినట్లు సభ్యులు తెలిపారు. అందులో భాగంగా శనివారం ప్రముఖ ఐదవ శక్తిపీఠం కలిగిన అలంపురం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి స్వామి దేవస్థానం నుంచి మండలి సభ్యులు పాదయాత్రగా అఖండ జ్యోతిని తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు.సోలాపూర్ చేరుకుని అక్కడ పూజలు నిర్వహించనున్నట్లు మండలి సభ్యులు తెలిపారు.